
ప్రజల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మండలంలోని కంచర్ల ఏఎన్ఎం హేమలత వివరించారు. శనివారం వికాసిత్ భారత్ సంకల్పయాత్ర గ్రామానికి చేరుకున్న సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ పి గ్యాస్ నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కలెక్షన్లను అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.