తాడ్వాయి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా కోటే రమేష్ 

– ఘనంగా సన్మానించిన మండల విలేకరులు
నవతెలంగాణ-తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక ఆదివారం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా కోట రమేష్ (సాక్షి )ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోటే రమేష్ మాట్లాడుతూ..  జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న, మండలంలోని ప్రజా ప్రతినిధులు,అధికారుల సహాయసహకారాలతో ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోకిల సారయ్య, బండారు లక్ష్మయ్య, తమ్మల్ల సమ్మయ్య గౌడ్, చింతల దేవేందర్, చల్లగొండ శ్రీకాంత్ రెడ్డి, తిర్వాయిముడీ పురుషోత్తం తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు కోట రమేష్ ను బోకే ఇచ్చి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.