
– ధ్వజరోహణ మహోత్సవం
నవతెలంగాణ-తలకొండపల్లి : మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజరోహణ వైభవంగా ఆరంభమయ్యాయి చేపట్టడం జరిగింది. ఈనెల 23 నుండి 28 వరకు వారం రోజులపాటు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నట్లు ఆలయ కార్య ఈవో స్నేహలత తెలిపారు. వారం రోజులపాటు కొనసాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు స్థానికులతో పాటు ఆలయ నిర్వహికులు స్థానిక సర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 24న ధ్వజరోహణ, 25 న తీర్థ కల్యాణోత్సవం , అన్నదానం, 26న రాత్రి ఆలయ ప్రాంగణంలో భజన పోటీలు రథోత్సవం, 27న దోత్సవం, బండ్లు తిరుగుట, 28న చక్రతీర్థం గరుడసేవ, నాగవల్లి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగిస్తున్నట్లు ఆలయ నిర్వహణ అధికారి ఈవో స్నేహలత తెలిపారు. వారం రోజులు కొనసాగి బ్రహ్మోత్సవాలకు ఈ కార్యక్రమానికి తలకొండపల్లి మండల కేంద్రంతో పాటు హైదరాబాద్, శంషాబాద్, షాద్ నగర్, ఆమనగల్ , మిడ్జిల్, కల్వకుర్తి, వెల్దండ, జడ్చర్ల, నాగర్ కర్నూల్, అచ్చంపేట కేశంపేట్ మండలాల నుండి ఈ దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వస్తున్నట్లు నిర్వాహకులు భక్తులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి జోష్ణ వారి సతీమణితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.