గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు గేదెలు మృతి

– ఎస్సై రాజు
నవతెలంగాణ పెద్దవంగర
గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మోత్య సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యపేట జిల్లా, తిరుమలగిరి మండలం, జలాలపురం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి ఎల్లయ్య కు చెందిన రెండు గేదెలు నిన్న సాయంత్రం మేతకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడా వెతికినా ఆచూకీ లభించలేదు. ఆ గేదెలు తెల్లవారుజామున మండల పరిధిలోని మోత్య తండా సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రబెల్లి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.