హాకీ అథ్లెట్లకు సాయం

హాకీ అథ్లెట్లకు సాయంహైదరాబాద్‌ : ఇద్దరు యువ హాకీ క్రీడాకారులు అరుణ్‌, తరుణ్‌కు రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు కొండా విజరు కుమార్‌. ప్రతిభ కలిగిన కుర్రాళ్లు హాకీ పరికరాలు కొనుగోలు చేసేందుకు ఈ సాయం చేసినట్టు ఆయన తెలిపారు. ఇటీవల హాకీ సంఘం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విజరు కుమార్‌.. తెలంగాణలో హాకీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, పాఠశాల స్థాయి నుంచి హాకీ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.