ముంబయి : ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌కు భారత మహిళల క్రికెట్ జట్టును సోమవారం ఎంపిక చేశారు. దేశవాళీ క్రికెట్‌లో మెరిసిన సైక, శ్రేయాంక, మన్నత్ కశ్యప్, టిటాస్ సదూలు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. రేణుక సింగ్, రిచా ఘోష్ సైతం వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. భారత్, ఆసీస్ తొలి వన్డే గురువారం ముంబయి వాంఖడేలో జరుగనుంది. భారత జట్టు : హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), మంధాన, జెమీమా, షెఫాలీ, దీప్తి, యస్టికా, రిచా, ఆమన్జోత్, శ్రేయాంక, మన్నత్, సైక, రేణుక, టిటాస్, పూజ, రానా, హర్లీన్.