గ్యాస్ ఈ కేవైసీకి తప్పని తిప్పలు

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం పరిధిలో తాడూరు గ్రామానికి చెందిన మహిళలు గుండమోని నారమ్మ, బాత్కుల బాలమ్మ మంగళవారం ఉప్పునుంతల మండలా కేంద్రానికి బస్సు సౌకర్యం లేక ఇండియన్ గ్యాస్ కనెక్షన్ ఆఫీసు ఉప్పునుంతల ఉన్నందున కాలినడకన ఆరు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఈ కేవైసీ చేయచుకోవడానికి వెళ్తున్న వృద్ధుల మహిళలను విచారించగా గ్రామాలలో అందరూ అంటున్నారు గ్యాస్ ఆఫీసుకు వెళ్లి వేలు పెడితేనే కానీ గ్యాస్ తక్కువ రేటుకు రాదంట అని వాళ్ళు తెలిపారు. పౌర సరఫరల సంబంధిత శాఖ అధికారులు ప్రతి గ్రామాలలో ఆందోళన చెందుతున్న మహిళలకు అర్థమయ్యే రీతిగా దండోరా వేయించి గ్యాస్ వినియోగదారులకు పలు సూచనలు తెలపాలని కోరుతున్నారు.