భిక్కనూరులో భారత్ గ్యాస్ కేవైసీ

charset=InvalidCharsetId

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలోని నగరేశ్వర ఆలయంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నాగేశ్వర్ మాట్లాడుతూ భారత్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ కొరకు కనెక్షన్ ఎవరి పేరు పై ఉంటుందో వారు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని నగరేశ్వర ఆలయం వద్ద కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, ఈ గ్యాస్ కేవైసీ అప్డేట్ శనివారం వరకు కొనసాగుతుందని, మండల ప్రజలు కేవైసీ అప్డేట్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేవైసీ అప్డేట్ చేస్తున్నవారు రాఘవేంద్ర, రోహిత్, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఉన్నారు.