ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

నవతెలంగాణ-ధర్మసాగర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 28 నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో స్థానిక ఎంపీడీవో జవహర్ రెడ్డి అధ్యక్షతన ప్రజా పాలన,గ్రామ సభల నిర్వహణ  శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  ఆదేశాల మేరకు 9 రోజులలో నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాలను ప్రత్యక్షంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అధికారులు ప్రజా ప్రతినిధులు అంగన్వాడి ఆశా కార్యకర్తల సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమన్ని ప్రజా సేకరణను నిశితంగా రికార్డుల్లో పొందుపరచాలని సూచించారు. పాలన అనేది కాలా అనుగుణంగా ఎప్పుడు ఒకే రీతిగా ఉండకూడదని, ప్రజల యొక్క అభిష్టం మేరకు మార్పులు జరుగుతాయని,పూర్వ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను, ఈ ప్రభుత్వం కొనసాగించాలని గ్యారెంటీ ఉండదన్నారు. అనంతరం ఉమ్మడి మండలాల జడ్పిటిసిలు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మేము స్వాగతిస్తున్నామని, దాన్ని అమలుపరిచే విధానంలో ప్రతి చర్య ప్రజా సంక్షేమం దృష్టిలో ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న ఈ పథకాలు సక్రమంగా నిర్వహిస్తే మంచిదన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారెంటీ పథకాలను అమ్మలు పరిచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  మండల పంచాయతీ అధికారి కె కరుణాకర్ రెడ్డి, జడ్పిటిసిలు పి శ్రీలత సత్యనారాయణ, చాడ సరిత, ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి, వైస్ ఎంపీపీ బండారు రవీందర్, సీఐ శ్రీధర్ రావు, సర్పంచులు మునిగేల రాజు, పెసర రమేష్, అన్నమ్మ,సరిత, శోభ, మంజుల కిష్టయ్య, ఎంపీటీసీలు బొడ్డు శోభ, కోలిపాక వనమాల, శ్రీనివాస్ రెడ్డి, మండలంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీ, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడి ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.