నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వందలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు అంతకుముందు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ శబరిమాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం శ్రీ శబరిమాత ఆశ్రమంలో ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు ఉదయం సుప్రభాతము ధ్యానంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి డోలారోహణము దత్తాత్రేయ జయంతి గ్రామంలో భిక్షాటన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు రాత్రి రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఎల్లారెడ్డి గ్రామారెడ్డి ప్రధాన రహదారిపై రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు బుధవారం గ్రామంలో అమ్మవారి పాదుకల ఊరేగింపు నిర్వహిస్తారు అనంతరం శ్రీ శబరిమాత ఆశ్రమం పక్కనే ఉన్న గుట్టపైన అమ్మవారి పాదుకపూజను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేశారు.
భక్తులకు ప్రత్యేక అన్నదానం
శ్రీ శబరిమాత ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ప్రత్యేక అన్నదానం నిర్వహించారు తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాలు అయిన లింగంపేట దోమకొండ కామారెడ్డి సదాశివనగర్ మెదక్ ఎల్లారెడ్డి భిక్కనూరు గాంధారి నాగిరెడ్డిపేట మండలాల నుంచి నిర్మల్ అదిలాబాద్ మెదక్ వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి కర్ణాటక మహారాష్ట్ర నుంచి ప్రత్యేక భక్తులు తరలివచ్చారు ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుని ఆశ్రమం ఆవరణలో అన్న ప్రసాదాలు స్వీకరిస్తే కోరుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం ఎంతో మంది భక్తులు వేలాది రూపాయలు అమ్మవారికి విరాళంగా అందిస్తారు సంవత్సరం పాటు అన్నదానానికి కొదవ లేకుండా బియ్యం పప్పులు విరాళంగా అందిస్తారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారు సంజీవులు వైస్ ఎంపీపీ నర్సింలు గ్రామ పెద్దలు మహేందర్ రెడ్డి వెంకట్ రామ్ రెడ్డి శ్యామ్ రావు శంకర్రావు పిచ్చయ్య రామ శంకర్ రాజు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.