– రూ.50 లక్షల కోట్లకు ఎయుఎం
– రేటింగ్ ఎజెనీ ఇక్రా వెల్లడి
ముంబయి : ప్రస్తుత ఏడాది 2023లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో 125 శాతం వృద్ధి చోటు చేసుకోనుందని రేటింగ్ ఎజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నవంబర్‌లో ఎంఎఫ్‌ల్లోకి రూ.25,616 కోట్లు వచ్చాయని.. ఈ ఏడాది జనవరిలో రూ.11,373 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈ రంగంలో పెట్టుబడులకు చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని ఇక్రా అనలిటిక్స్ మార్కెట్ డాటా హెడ్ అశ్విన్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరల్లో స్థిరత్వం, వడ్డీ రేట్లలో మార్పులు ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులకు మద్దతును ఇస్తున్నాయన్నారు. 2023 నవంబర్ 30 నాటికి ఎంఎఫ్ పరిశ్రమ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) రూ.49.05 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరి 31 నాటికి ఇది రూ.39.62 లక్షల కోట్లుగా ఉంది. డిసెంబర్ ముగింపు నాటికి రూ.50 లక్షల కోట్ల మైలురాయికి చేరనుందని అంచనా. వచ్చే కొన్నేళ్లలో రూ.100 లక్షల కోట్లకు చేర్చాలని ఎంఎఫ్ పరిశ్రమ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్)ల్లో ప్రతీ నెల రూ.250 నుంచి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇటీవల సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతులిచ్చింది.