కన్నుల పండుగగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ లో కొనసాగుతున్న అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బుధవారం ఉత్సవాలలో భాగంగా బ్రహ్మశ్రీ కొండకండ్ల శ్రీరామ చరణ్ శర్మ ఆధ్వర్యంలో పలురు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణాల మధ్య  మంగళవారం రాత్రి జలాధివాసం చేయించిన అయ్యప్ప స్వామి విగ్రహం తో పాటు పలు ప్రతిష్టాపన విగ్రహాలను బయటకు తీశారు. నూతన ఆలయంలో ప్రతిష్టించే అయ్యప్ప విగ్రహానికి జలాలతో, పలు రకాల పుష్పాలతో  అభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా యాగశాల మండప పూజలు, హోమము, దేవతామూర్తులకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యప్ప స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం  దేవతామూర్తులకు దాన్యాధివాసం నిర్వహించి, శ్రీ వల్లి దేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. భక్తులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకించారు.