మండలంలోని మాణిక్ బండార్ గ్రామా శివారులోని ఆర్టీసీ కాలనీ కమిటీ అభివృద్ధి అధ్యక్షులు ఎస్.రాజేందర్ ఆధ్వర్యములో బుదవారం ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్యెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ నివాసములో ఎమ్యెల్యేగా గెలుపొందిన సందర్భముగా ఎమ్యెల్యేనీ ఆర్టీసీ కాలనీ తరుపున శాలువాతో సత్కరించి, ఆర్టీసీ కాలనీలోని డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పార్క్ స్థలములో ఓపెన్ జిమ్, పార్క్ స్థలములో కమ్యూనిటీ హాల్ నిర్మాణము, స్మశాన వాటికలో ప్రహరీ గోడ, నీటి వసతి, స్నానము గదులు ఏర్పాటు చేయుటకు నిధులు మంజూరు చేయించి పనులు జరిగేలా చూడాలని ఎమ్యెల్యే పైడి రాకేష్ రెడ్డినీ ఆర్టీసీ కాలనీ తరుపున కోరడమైనది. ఎమ్యెల్యే పై సమస్యలపై స్పందించి వారు త్వరలోనే పనులు చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఎమ్యెల్యేను ఆర్టీసీ కాలనీకి రావలిసిందిగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కోశాధికారి ఎస్.గంగాధర్, ఆలయ కమిటీ అధ్యక్షులు జి.హన్మంత్ రెడ్డి, కోశాధికారి డివి.రాములు, ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు ఏ.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.