రేపటి నుండి ప్రజా పాలన..

– అల్లం రాజకుమార్ తహసిల్దార్
నవతెలంగాణ-గోవిందరావుపేట 
నూతన ప్రభుత్వ ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల యందు  రేపటినుండి ప్రజా పాలన కార్యక్రమములు కొనసాగుతాయని తహసిల్దార్ అల్లం రాజకుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా పాలన సన్నాహక సమావేశం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాహసిల్దార్ అల్లం రాజకుమార్  ప్రజాపాలన దరఖాస్తు నమూనాను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి  విడుదల చేసినారు. అనంతరం తహసిల్దార్ రాజకుమార్ మాట్లాడుతూ ప్రజా పాలన నమూనా వివరించి  రేపటినుండి జరుగు గ్రామ సభలలో దరఖాస్తు ఫారములు ప్రజల ద్వారా స్వీకరించుటకు తెలిపినారు. ఈ సమావేశమునలో ఎంపీపీ, సూడి శ్రీనివాసరెడ్డి ఎంపీటీసీలు, కోఆప్షన్ నెంబర్, సర్పంచులు, మరియు  అధికారులు మండల పంచాయతీ  అధికారి, తహసిల్దార్, టీం లీడర్లు  పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.  ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని ప్రజలు వినియోగించుటకు ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని కోరినారు.