ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల లోపునే అభయహస్తం 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అజ్జు యాదవ్ అన్నారు. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి కొరకు దరఖాస్తు చేసుకోవచ్చనీ తెలిపారు. మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యమని, పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుందనీ అన్నారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చి ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.