కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరు గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రతి ఒక్క లాబ్దిదారులకు అందేవిధంగా ప్రతి అధికారి ప్రత్యేక కృషి చేయాలని ఈ నేల 28 నుండి జనవరి 6వరకు చేపట్టే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. బుదవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఉన్నత స్థాయి అధికారులు వివిధ శాఖలకు సంబంధిచిన మండలాల అధికారులు సిబ్బంది తో అవగాహన కార్యక్రమం డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హాజరై మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం అమలు పై వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పిస్తూ, నియోజవర్గంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తూ గ్రామానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ది పొందేలా తగిన చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ది పొందేలా ప్రతి గ్రామంలో 28 తేదీ నుండి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రతి ఒక్క అధికారి ప్రజలతో మమేకమై వారికి ప్రతి ఒక్క పథకం గురించి వివరిస్తు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్డిఓ రాజే ఎసిపి కిరణ్ కుమార్, డి.ఆర్. డి.వో పిడి.ప్రత్యెక అధికారి చందర్ నాయక్, రంజిత్ రెడ్డి , సంజివ్ కుమార్, తహసిల్దార్ల రాజేందర్, వెంకట్రావు, ఎంపిడివో లు టివిఎస్ గోపి బాబు, రాములు నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్సై లు యు మహేష్,ఎస్ మహేష్, కాంగ్రెసు పార్టీ ముఖ్య నాయకులు అమృతాపుర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్, శ్యాంసన్, ముప్పగంగారెడ్డి ,దర్మగౌడ్ తో పాటు నియోజకవర్గం లోని అధికారులు, వివిధ శాఖల నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.