ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

నవతెలంగాణ-తొగుట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం పై అధికారులు ప్రజాప్రతినిధు లు సమిష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని డిఆర్డిఓ జయదేవ్ ఆర్య అన్నారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, అధికారులతొ సమీక్ష సమా వేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ గురువారం నుండి ప్రారంభం కానున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు,అధికారు లు సమిష్టిగా విజయవంతం చేయాలన్నారు.కార్య క్రమం పై ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అధికారు లను హెచ్చరించారు.ప్రజా పాలనలో వచ్చే దర ఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు.దరఖాస్తుల కోసం వచ్చే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ మేని ఫెస్టోలో ప్రవేశపెట్టిన ఐదు గ్యారెంటీల పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో రెండు టీంలను ఏర్పాటు చేశామన్నారు.ఒక టీంకు ఎంపీ డీవో,మరొక టీంకు తహసీల్దార్ బాధ్యత వహిస్తార ని అన్నారు. ఒక్కోక్క టీమ్ ప్రతిరోజు రెండు గ్రామా లలో కార్యక్రమాన్ని నిర్వహింస్తుందని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న పెన్షన్ దారుల నుండి ఎలాంటి దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులను ఆదేశిం చారు.పతి గ్రామంలో 100 ఇండ్లకు ఒక కౌంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,ఎంపీటీసీ సూతరి లలిత రమేష్,సర్పంచ్ పాగాల కొండల్ రెడ్డి, పిఏసీ ఎస్ చైర్మన్ కన్నయ్య హరికృష్ణ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల  అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు
 పాల్గొన్నారు.