మండలంలో చలి తీవ్రత పెరగడంతో పాటు, ఉదయం దట్టమైన పొగ మంచు అల్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పొద్దెక్కేవరకు ఇంట్లో నుండి ప్రజలు బయటకు వెళ్లాలంటే ఎముకలు కొరికే చలితో భయపడుతున్నారు. మండలంలో ఉదయం 8 గంటలైనా సూర్యుడు ఉదయించిన, దట్టమైన పొగ మంచుతో ఉదయిస్తున్న చంద్రునిగా కనిపించాడు. వృద్ధులు, చిన్నపిల్లలతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, చలిలో ప్రయాణాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.