ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలను సమర్ధవంతంగా అమలయ్యే విధంగా చూడాలని బొమ్మలరామారం మండల ప్రత్యేక అధికారి జ్యోతి కుమార్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని ఓం శివ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన 6 గ్యారంటీల పథకం పై మండల ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28 తేదీ నుండి వచ్చేనెల ఆరో తేదీ వరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభను నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు పత్రాలను గ్రామసభల ద్వారా తీసుకోవాలని సూచించారు. ఇట్టి కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనవసరమైన జిరాక్సులు జమ చేయకుండా దరఖాస్తు పత్రంతో ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ రెండు మాత్రమే జతపరచాలని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.ఈ పథకం సమర్థవంతంగా విజయవంతం అయ్యే విధంగా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సరిత, ఎంఏఓ పద్మ, ఎంపీఓ శ్రీ మాలిని, మండలంలోని అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు