నాగ్ పూర్ కు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు


నవతెలంగాణ కమ్మర్ పల్లి: మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పలు వాహనాల్లో తరలివెళ్లారు. సభకు తరలి వెళ్లిన వారిలో నాయకులు పాలెపు నరసయ్య, గంగారెడ్డి, బుచ్చి మల్లయ్య, నాగపూర్ అశోక్, అబ్దుల్ రహీం, పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.