నవతెలంగాణ-చిన్నకోడూరు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో రమేష్ అన్నారు. చిన్నకోడూరు మండల పరిధిలోని అల్లీపూర్, కిష్టాపూర్ గ్రామాలలో గురువారం నిర్వహిస్తున్న 6గ్యారేంటీలతో కూడిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దరఖాస్తుదారులు దరఖాస్తు నింపడానికి సహకరించాలని, ఇతర సమస్యలు పై దరఖాస్తు వచ్చిన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ జయలక్ష్మి, ఎంపిడిఓ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.