30 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌

Verification of certificates from 30– ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 30 నుంచి సర్టిఫికేట్ల వెరిఫిరేషన్‌ చేపట్టనున్నట్టు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తెలిపింది. జనవరి ఆరో తేదీ వరకు వెరిఫికేషన్‌ కొనసాగనున్నది. ప్రొవిజనల్‌ లిస్ట్‌లో పేర్కొన్న అభ్యర్థులు అవసరమైన సర్టిఫికేట్లతో హాజరు కావాలని కోరింది. మరిన్ని వివరాల కోసం బోర్డు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.