జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా

– వంగ నవీన్‌, కేశిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
108 ఉద్యోగుల జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వంగ నవీన్‌, కేశిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికలతో పాటు ఉద్యోగుల సమస్యలపై చర్చించినట్టు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. 108 అంబులెన్స్‌ సర్వీసుల్లో ఈఎంటీ పైలట్లతో రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ ఆఫ్‌లు, లీవులు ఇవ్వడం లేదని తెలిపారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని రాష్ట్ర లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈఎంఆర్‌ఐ యాజ మాన్యం, ఉద్యోగుల జేఏసీతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్టు కమిషనర్‌ తెలిపారు. సమా వేశానికి ఉద్యోగులు హాజరు కావాలని ఆయన సూచించారు.