– సర్పంచ్ తీగల కర్ణ శ్రీ గిరిధర్ రెడ్డి
నవతెలంగాణ నూతనకల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయ హస్తం, ఆరు గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో అభయహస్తం దరఖాస్తు పత్రాలను అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. దరఖాస్తు ఫారాలను ప్రజలు కొనుగోలు చేయవద్దని ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. దరఖాస్తుకు కావలసిన జిరాక్స్ లను తమ వద్ద ఉంచుకొని గ్రామసభ రోజున అధికారులకు అందజేసి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.