శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థను తక్షణమే సీజ్ చేయాలి

– ఏఐపీఎస్యు, ఎస్ ఎఫ్ ఐ, టీజీవిపి, ఎల్ ఎస్ ఓ     
నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లాలో అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థను తక్షణమే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలు నిజామాబాద్ లోనే కాకుండా ఆర్మూర్ మండలంలో కూడా ఉండడం జరిగింది దాన్నిట్లో ప్రతినిత్యం ఏదో ఒక రకమైనటువంటి విద్యార్థుల పైన న ఉపాధ్యాయుల పైన ఏదో రకంగా హింసకాండ జరుగుతూనే ఉంటుంది గతంలో కూడా విద్యార్థుల పై చేయి చేసుకున్నారని చెయ్యి విరిగిపోయిందని అదేవిధంగా ఒక మేడం మరణానికి కూడా కారణం అయ్యారు అనేటటువంటి వార్తలు అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు కొత్తగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను క్రిస్టమస్ సెలవుల కన్న ముందు రోజు పగిలిన ట్యాంకును దృష్టిలో పెట్టుకొని వాటర్ ట్యాంకును దానికి సంబంధించినటువంటి అంశాలను స్కూల్ పునర్ ప్రారంభమైన తర్వాత విద్యార్థులను ఒక్కొక్కరిగా గదిలోనికి పిలిచి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరించడం అందులోని పదవ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థుల పైన చేయి చేసుకోవడం కూడా విపరీతంగా కొట్టడం కూడా జరిగిందని ఈరోజు పత్రికల్లో కూడా రావడం జరిగింది అయినప్పటికీ విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసo విద్యాశాఖగా అందుకని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఏఐపిఎస్యు టీజీవిపి విద్యార్థి సంఘాలుగా జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి కనీసం  రెండవ శనివారం, ఆదివారం కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వకుండా స్కూల్లో నడుపుతున్నారని విద్యార్థులకు మానసిక ఒత్తిడి చేస్తున్నారని టీచర్లకు సైతం వర్క్ ప్లెజర్ ఉందని చాలాసార్లు టీచర్లు కూడా ఫిర్యాదులు చేసినటువంటి దాఖలు ఉన్నాయి ఇందులో ఏమాత్రం మార్పు లేదని కార్పొరేట్ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీని ఇంకా చాలా నట్టు స్కోరుల పేర్లతోనే టెస్టులు పెట్టి డబ్బులు వాసులు చేయడము అదేవిధంగా ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో స్టాఫ్ లేకుండా వాంటెడ్ టీచర్స్ అని చెప్పేసి ప్రకటనలు ఇవ్వడం విద్యా సంవత్సరం పూర్తవుతున్నా కానీ వాంటెడ్ టీచర్స్ అని చెప్పేసి పత్రిక ప్రకటనలు ఇవ్వడం ఈ గొప్ప ఘనత శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలకే దక్కుతది కనీసం వర్క్ ప్లెజర్ ఉంటదని ఉండేటటువంటి సెకండ్ సాటర్డే సండే కూడా వదలకుండా ఉపాధ్యాయులను వేధించడం విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేయడము ఆ విద్యార్థుల పైన  కొట్టడం ఇవన్నీ ఒక ఉపాధ్యాయుడిగా పాఠశాలలను నరిపే లక్షణాలు మాత్రం కాదు కనీసం విద్యాశాఖ అధికారులు కూడా లెక్క చేసినటువంటి పరిస్థితి లేదు ఆఫీసర్లు ఇచ్చిన నోటీసులకు కూడా వీళ్లు ఇచ్చే సమాధానం సరైనదిగా ఉండదు గత రెండు నుంచి మూడు ఏళ్లుగా ప్రతినిత్యం ఏదో ఒక విషయంలో శ్రీ చైతన్య పైన విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి విద్యాశాఖలు నోటీసులు ఇస్తూనే ఉన్నాయి కానీ ఆ యొక్క కార్పొరేట్ సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోలేదు గుపన్ పల్లి బ్రాంచ్ లో మాత్రం ఇప్పటివరకు కూడా బాత్రూంలో కూడా సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు పైన నుంచి కావున ఇన్ని లోపాకు కారణమైనటువంటి వ్యవస్థను నడుపుతూ దానికి పాఠశాల పేరు పెట్టి ధనార్ధనకు పాల్పడుతున్నటువంటి కార్పొరేట్ శ్రీ చైతన్యను తక్షణమే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా వెళ్లడం జరిగింది దానికి డీఈఓ సానుకూలంగా స్పందించి ఎంక్వయిరీ చేయిస్తామని ఖచ్చితంగా ఆర్మూర్ బ్రాంచ్ పైన చర్యలు తీసుకుంటామని ఆర్ జె డి కి పంపుతామని అదే విధంగా భూపన్పల్లి బ్రాంచ్ బిల్లింగ్ కి సంబంధించి కూడా ఆర్ జె డి కి నివేదిక పంపుతామని విద్యార్థి సంఘాలకు చెప్పి ఫార్వర్డ్ చేయడం జరిగింది తక్షణమే ఆ కార్పొరేట్ విద్యాసంస్థల మీద చర్యలు తీసుకోకపోతే కఠినంగా విద్యార్థి సంఘాలుగా ఊరుకునేది లేదని మూడు విద్యార్థి సంఘాలు కూడా జిల్లా విద్యాశాఖ అధికారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు కిరణ్, అనిల్, కళ్యాణ్ జ్వాలా ,విగ్నేష్, జీవన్,తదితరులు పాల్గొన్నారు.