అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి

– ప్రతి దరఖాస్తు తప్పనిసరిగా తీసుకుంటాం
నవతెలంగాణ మిరు దొడ్డి: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతుందని తాసిల్దార్ గోవర్ధన్ ఎంపీడీవో రాజిరెడ్డి లు అన్నారు. శుక్రవారం మిరుదొడ్డి మండలంలోని కాసులాబాద్, అల్వాల, మల్లుపల్లి గ్రామాల్లో అభయాసం ఆరు గారెంటీలపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలకు అందే విధంగా దరఖాస్తులు అందించిన వారికి వెంటనే రసీదు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ప్రతి ఒక్కరి దరఖాస్తును స్వీకరించుకోవడం జరుగుతుందని సూచించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి వారి యొక్క దరఖాస్తును యధావిధిగా అందించాలని అన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటింటా తప్పనిసరిగా దరఖాస్తును తీసుకొని వారి కి రసీదును ఇవ్వడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పిటిసి లక్ష్మీ లింగం, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, సర్పంచ్లు కిష్టయ్య, తుమ్మల బాలరాజు, లక్ష్మీ యాదగిరి, సిద్ది భారతి భూపతి గౌడ్, ఆర్ఐ కొండల్ రెడ్డి, రాజకుమార్ సూపర్డెంట్ నారాయణ తో పాటు వివిధ శాఖల అధికారులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.