మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

– శ్రీరామ కృష్ణ సేవా ట్రస్ట్
నవతెలంగాణ-తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని బంజర ఎల్లాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన కొట్టెం సమ్మయ్య దశదినకర్మకు, మంగపేట మండలం కు చెందిన శ్రీరామ కృష్ణ సేవా ట్రస్ట్ అధ్యక్షులు బాడిషా నాగ రమేష్ 4 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పేద కుటుంబానికి సహాయ సహకారాలు అందించిన శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ కు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగారం పెద్దమనిషి బెల్లంకొండ రోశయ్య, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమల సమ్మయ్య గౌడ్,  మేడారం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాలి కన్నయ్య , గ్రామ ఆదివాసి నాయకులు పూణెం లక్ష్మీనారాయణ, తోలెం మంగన్న, ఈసం విజయ్ కుమార్, నాలి సురేష్, పూణెం సంపత్ కుమార్, శంకర్, అల్లం ప్రభాకర్ ఆగబోయిన బిక్షపతి తదితరులు మహిళలు పాల్గొన్నారు.