అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలి

నవతెలంగాణ-చంద్రాయణగుట్ట
అరులైన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలి అని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బండ్లగూడ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) డివిజన్‌ కార్యదర్శి కృష్ణ నాయక్‌ మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలను గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రజలకు నివాస గృహాలు లేక అద్దె ఇండ్లలో కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద ప్రజలుకు పూర్తయిన ఇండ్లను వెంటనే కేటాయిం చాలని కోరారు. ఉన్న ఇంటిని కూలదోసి అక్కడే డబల్‌ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించి, ఇంకా అరులైన వారికే ఇల్లు అందజేయకపోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వం దాదాపు హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టిస్తామని చేసిన వాగ్దానాలు అమలు కాలేదన్నారు. ఇప్పటివరకు 50 నుంచి 60వేల ఇండ్లను వరకు మాత్రమే పూర్తి చేసినట్టు తెలిపారు. అందులో 10వేలను మాత్రమే అర్హులుగా గుర్తించ మిగతావన్నీ ఎవరికీ ఇవ్వ కుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న జంగంమేట్‌ డివిజనన్‌లో స్థానికులకు 72 మందికి అర్హులుదారుగా సర్టిఫికెట్‌ గుర్తించారని అక్కడ స్థానికులు వారూ గతంలో అనేకసార్లు అధికారులకు కలెక్టర్‌ విన్నవించుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు శ్రీను, రాజేష్‌, మహేష్‌, లక్ష్మి, భారత్‌, శాంతమ్మ, గోవింద్‌, తదితరులు పాల్గొన్నారు.