టెస్టు జట్టులోకి అవేశ్‌ ఖాన్‌

టెస్టు జట్టులోకి అవేశ్‌ ఖాన్‌– మహ్మద్‌ షమి స్థానంలో ఎంపిక
కేప్‌టౌన్‌ : దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు యువ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ ఎంపికయ్యాడు. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి గాయంతో సఫారీ పర్యటనకు దూరం కాగా.. అతడి స్థానంలో అవేశ్‌ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంటూ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. భారత్‌-ఏ జట్టు తరఫున సఫారీ టూర్‌లో ఉన్న అవేశ్‌ ఖాన్‌ నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇప్పటికే ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. భారత్‌, దక్షిణాఫ్రికా రెండో టెస్టు జనవరి 2 నుంచి కేప్‌టౌన్‌లో ఆరంభం కానుంది. ఆ ఇద్దరు కావాలి : రెండో టెస్టులో టీమ్‌ ఇండియా తుది జట్టులో రెండు మార్పులను సూచించారు సునీల్‌ గవాస్కర్‌. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, పేసర్‌ ముకేశ్‌ కుమార్‌లను జట్టులోకి తీసుకోవాలని సన్నీ ఓ టెలివిజన్‌ షోలో తెలిపాడు. రోహిత్‌సేన అంతర్గత ప్రాక్టీస్‌ మ్యాచులతో ఉపయోగం లేదని, దానికంటే ఇంట్లో విశ్రాంతి తీసుకుని నుంచి నేరుగా మ్యాచ్‌ బరిలోకి దిగటం మేలని వ్యాఖ్యానించారు.