– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఎల్‌సీజీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్టీ)లో అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేసి వారిని వెంటనే రిలీవ్ చేయాలని లోకల్ క్యాడర్ గవర్నర్‌మెంట్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్‌సీజీటీఏ) డిమాండ్ చేసింది. ఈమేరకు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడోజు వీరాచారి, సలహాదారుడు సానా సురేందర్ కలిసి వినతిపత్రం సమ ర్పించారు. డైట్ కాలేజీలు, డీఈవో కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేసి వారి పాఠశాలలకు పంపించాలని సూచించారు. కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ జిల్లా పరిషత్ స్కూళ్ల నుంచి రీప్యాట్రి యేషన్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.