వార్షిక నేర వివరాల రిపోర్టును వెల్లడించిన రామగుండం పోలీస్‌ కమీషనర్‌

– 2023 సంవత్సరంలో వివిధ రకాల నేరాలకు సంబంధించి 8926 కేసులు నమోదు
నవతెలంగాణ-గోదావరిఖని
రామగుండం పోలీస్‌ కమీషనరేట్‌లో 2023 వార్షిక నేర వివరాలను పోలీస్‌ కమీషనర్‌ రెమా రాజేశ్వరీ శుక్రవారం ఒక రిపోర్టు ద్వారా వెల్లడించారు. రామగుండం కమీషరేట్‌ పరిధిలోని రెండు జిల్లాలు పెద్దపల్లి, మంచిర్యాలలో గత సంవత్సరం 2022లో వివిధ నేరాలకు సంబంధించి 6963 కేసులు నమోదు కాగా, 2023 సంవత్సరంలో 8926 కేసులు నమోదు అయినట్లు, గతంతో పోలీస్తే ఈ సారి 1963 కేసులు ఎక్కువగా నమోదు అయినట్లు తెలిపారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామగుండం కమీషనరేట్‌ పరిధిలోని రెండు జిల్లాల్లో ఎన్నికల సందర్భంగా మొత్తం 3052 సివిల్‌ అధికారులు సిబ్బంది, 16 కంపెనీల కేంద్ర బలగాలు, 1150 ఇతర రాష్ట్ర ఓలీసుల సహకారంతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా కమీషనరేట్‌ పరిధిలో 80,805,161 నగదును సీజ్‌ చేశామని, అదేవిధంగా 2,694,271 రూపాయల విలువ గల బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నామని, 6,86,075 రూపాయల విలువ జేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 15,38, 823.75 రూపాయల విలువజేసే మద్యం, పటిక, బెల్లం స్వాధీనం చేసుకున్నట్టు, 12,86,564 రూపాయల విలువ జేసే స్పీకర్లు, యాంపిఫయర్హు, టేకు దుంటలు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు, 1400 కేఉల్లో 4296 మందిని భైండోవర్‌ చేసినట్లు తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలో ఈ చలాన్స్‌ ద్వారా 3,57,412 కేసులు నమోదు చేసి 9,44,38,760 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. డ్రంక్‌ అండ్‌ ట్క్రవ్‌లో 11,510 కేసులు నమోదు చేయడం జరిగిందని, ఆ కేసులలో 6273 మందికి 91,25,730 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. 330 మందిపై 59 గ్యాంబ్లింగ్‌ కేసులు నమోదు చేశామని, 16,97,023 రూపాయల నగదు సీజ్‌ చేసినట్లు తెలిపారు. 537 మందిపై 523 గుడుంబా కేసులు నమోదుచేయడం జరిగిందని, వారి వద్ద నుంచి 2656 లీటర్ల గుడుంబా సీజ్‌ చేయగా,దాని విలువ 10,39,070 రూపాయలుంటుందని తెలిపారు. ఎక్ష్సెజ్‌ (ఐఎంఎఫ్‌ఎల్‌) 890 కేసులను 891 మందిపై నమోదు చేసి, వారి వద్ద నుంచి 5956 లీటర్లు స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ 40,33,433 రూపాయలుంటుందని తెలిపారు. అదేవిధంగా ఎన్‌డిపిఎస్‌ యాక్ట్‌, ఇసి యాక్ట్‌ కింద పలు కేసులు నమోదు చేశామని, మిస్సింగ్‌ కేసులు, సుపీరియస్‌ సీడ్స్‌ కేసులు, రోడ్డు యాక్సిండెంట్‌ కేసుల వివరాలను, హిస్టరీ షీట్స్‌ వివరాలను ఈ రిపోర్టు ద్వారా వెల్లడించారు. లోక్‌ అదాలత్‌ కింద 1915 కేసులను పరిష్కరించడం జరిగిందని, నాన్‌బెయిలబుల్‌ కింద 675 వారెంట్‌లు ఎగ్జిక్యూట్‌ చేశామని, 16,666 ఈ పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలో 1332, నేను సైతంలో భాగంగా 739 మొత్తం 2071 సిసి కెమరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 116 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు అయ్యాయని, 32 కేసులలో ఛార్జ్‌ షీట్‌ వేసి తరువాత నష్టపరిహారం కోసంప్రతిపాదన పంపగా 5లక్షలు నాలుగు కేసులలో బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఆపరేషన్‌ స్మైల్‌, ముస్తాన్‌ కింద 93 మందిని రక్షించడం జరిగిందని తెలిపారు. షీ టీర్స్‌ పని తీరుపై, మహిళా సంబంధిత కేసుల గురించి ఈ రిపోర్ట్‌ ద్వారా తెలిపారు. 322 సైబర్‌ నేరాల కేసులు నమోదు అయ్యాయని, 337 కేసులలో బాధితులు పోగొట్టుకున్న సొమ్ము 4,30,89,543 రూపాయలను రికవరీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కమీషనరేట్‌ పరిధిలో మావోయిస్టు కార్యకలాపాలు, పలు శిక్షణ కార్యక్రమాలు, సైబర్‌ క్రైమ్‌, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో, ఐటి కోర్‌, డయల్‌ 100, టాస్క్‌ఫోర్స్‌, అభయ యాప్‌, వైద్య శిబిరం, సీనియర్‌ సిటిజన్‌ స్వచ్చంద కమిటీ, ఇతర విజయాలను వివరించారు.