నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని కేమ్రాజ్ కల్లాలీ గ్రామములో గ్రామ సర్పంచ్ రమేష్ దేశాయి ఆద్యక్షతన ప్రజాపాలనలో భాగంగా పండుగ వాతావరణంలో మండల అధికారుల పర్యవేక్షణ, సమక్షంలో ప్రశాంతంగా కోనసాగీంది. ఈ సంధర్భంగా ఆరు గ్యారంటిల వంద రోజులలో హమీ నెరవెర్చే దిశగా ముఖ్యమైన దరఖాస్తుల స్వీకరణ ప్రజలు గత ప్రభూత్వ తప్పిదాలను మార్పు చేసి, కొత్త ప్రభూత్వం హమీల ఆమలు దిశగా పని చేయడం స్వాగతీస్తున్న ప్రజలు సంతోషంగా ఉందని పేర్కోన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అదికారులు, సర్పంచ్, గ్రామస్తులు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గోన్నారు.