దుబ్బాకను అభివృద్ధి చేసిన ఘనత ముత్యంరెడ్డి. కె దక్కుతుంది.

నవతెలంగాణ-తొగుట
దుబ్బాకను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన ఘనత ముత్యం రెడ్డి కె దక్కుతుందని ఆయన సతీమణి చెరుకు విజయమ్మ,మండల అధ్యక్షుడు అక్కం స్వామి అన్నారు.సోమవారం మండలం లోని తుక్కాపూర్ ఎక్స్ రోడ్ వద్ద స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి 79 వ జయంతి  వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు.అనంతరం వారు మాట్లా డుతూ స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్ గా, టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న  సమయంలో దుబ్బాకను అన్ని రంగాలలో అభి వృద్ధి చేశారని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల లో ఉంది దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ముత్యం రెడ్డి దక్కుతుందని అన్నారు. ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలు ఎప్ప టికీ మర్చిపోరని, దుబ్బాక ప్రజల మనసులలో అభివృద్ధి ప్రదాతగా నిలిచిపోయారని కొనియాడా రు.ఆయన చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, తొగుట సర్పంచ్ పాగాల కొండల్ రెడ్డి, టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి ముదిరాజ్, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పలయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లింగా ల కృష్ణ, నాయకులు మహిపాల్ రెడ్డి, తుక్కాపూర్ గ్రామ అధ్యక్షుడు బర్రింకల స్వామి, సంతు,రాజు, కనికి స్వామి, గోపాల్, స్వామి, చిక్కుడు బాలమల్లు, బషీర్, రాములు, నాగరాజు, ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ బుర్ర నరసింహులు, రమేష్, నరసవ్వ, వివిధ గ్రామాలకు చెందిన అధ్యక్షులు, నాయకులు బుట్టి ప్రభాకర్, రామస్వామి, భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.