25న ఉపాధిహామీ చట్టం రక్షణపై రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

– హాజరుకానున్న గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌
– ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో తరలాలి
– వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు పి.అంజయ్య
నవతెలంగాణ-యాచారం
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రక్షించుకునేందుకు ఈనెల 25న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల అంజయ్య కోరారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని కుర్మిద్ధ లో ఉపాధి కూలీ లతో మాట్లాడి ఈ సదస్సు ప్రాధాన్యత గురించి వివరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే ఉపాధి కూలీలకు వారం రోజులైనా డబ్బులు రాకపోవడం, ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఎండాకాలంలో ఉపాధి కూలీలకు సమ్మర్‌ అలవెన్స్‌ కూడా ఇవ్వకపోవడంతో కూలీలంతా ఏలా బతకాలని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. ఉపాధి హామీలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం రెండు పూటటా ఫొటో విధానం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్లో ప్రధాని మోడీ ఉపాధి హామీ చట్టానికి నిధుల కోత విధించి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 25న నిర్వహించే ఉపాధి హామీ చట్టం పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ సదస్సుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలందరూ అధిక సంఖ్యలో తర లిరావాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ హాజర వుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయ కులు పి పౌలు, పి ప్రభు, మల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.