నవతెలంగాణ ప్రతి అక్షరం ప్రజల పక్షం: సిఐ శంకర్.

నవతెలంగాణ-గోవిందరావుపేట
నవతెలంగాణ పత్రిక ప్రతి అక్షరము ప్రజల పక్షం అని పసర పోలీస్ స్టేషన్ సి ఐ శంకర్ అన్నారు. సోమవారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్లో నవ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐ శంకర్ మాట్లాడుతూ పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిక పనిచేయాలని అన్నారు. అపరిస్కృత ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తెస్తూ పరిష్కారం దిశగా కృషి చేయాలని అన్నారు. నవతెలంగాణ సమగ్ర దినపత్రిక ప్రజాపక్షమై నిలుస్తుందని అన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులకు పత్రికలు దిక్సూచి లా నిలవాలని అన్నారు. సామాన్య ప్రజానీకానికి పత్రికలు ఎప్పుడూ ఒక తోడుగా ఉండాలని వారి సమస్య పరిష్కారానికి అధికారుల సమన్వయానికి వారధిగా పనిచేయాలన్నారు.  ముందు ముందు నవ తెలంగాణ పత్రిక మరింత అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక విలేకరి సామ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.