– గత జయంతికి వాయిదా పడిన విగ్రహావిష్కరణ
– సర్పంచ్ స్వంత ఖర్చులతో విగ్రహ నిర్మాణం పూర్తి
– ఎమ్మెల్యే ప్రత్యేక చోరవ చూపాలని గ్రామస్తుల వినతి
నవతెలంగాణ-బెజ్జంకి
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ దేశ ప్రజలందరూ మహనీయుడిగా కొనియాడుతారు.ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం అంబేడ్కర్ కొందరికే కాదని..అందరి వాడని అయన జీవిత చరిత్ర గురించి అయా సందర్భాల్లో గొప్పగా చెబుతుంటారు. ఇంతవరకు బాగానే ఉన్న గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాల్లో నేటికి వివక్ష ఎదురవుతూనే ఉంది. రాష్ట్రంలో వివక్షను దాటుకుని నిర్మాణం పూర్తి చేసుకున్న ఎన్నో అంబేడ్కర్ విగ్రహాలు సైతం నిర్లక్ష్యం వల్ల అవిష్కరణకు నోచుకోక ముసుగులో మగ్గుతున్నాయి.మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామంలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సన్నద్దమై ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల వాయిదా పడింది.గత ఏడాదిగా అవిష్కరణకు నోచుకోక అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.ప్రజాప్రతిని ధులు ఇంకెన్నాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఇప్పటికైనా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ప్రత్యేక చోరవచూపాలని పలువురు గ్రామస్తులు విన్నవిస్తున్నారు.
సర్పంచ్ స్వంత ఖర్చులతో..
గాగీల్లపూర్ గ్రామంలో సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి తన స్వంత ఖర్చులతో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి చేసి గత ఏడాది అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహావిష్కరణకు సన్నద్ధం చేశారు.అనివార్య కారణాలతో విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది.సర్పంచ్ తన స్వంత ఖర్చులతో విగ్రహ నిర్మాణం పూర్తి చేసిన విగ్రహావిష్కరణ వాయిదాపడడంతో గ్రామస్తులు నిరాశలో ఉన్నారు.
ఏడాదిగా ఎదురుచూపులు..
మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం అవిష్కరణకు నోచుకోవడంతో గ్రామస్తులు అవిష్కరణ మహోత్సవం కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు.గత ఏడాది అంబేడ్కర్ జయంతి రోజు విగ్రహావిష్కరణకు పంచాయతీ పాలకవర్గం,అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు విగ్రహావిష్కరణకు సన్నద్ధమవ్వగా అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు సమయభావం వల్ల విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది.వాయుదా పడిన రోజు నుండి నేటి వరకు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు పునరాలోచన చేయకపోవడం అంబేడ్కర్ విగ్రహలపై నిర్లక్ష్యం కొనసాగుతుందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు,అంబేడ్కర్ యువజన సంఘం,ప్రజా సంఘాల నాయకులు గాగీల్లపూర్ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహావిష్కరణపై చోరవచూపాలని పలువురు విన్నవించారు.