రాష్ట్రపతి ఉత్తర్వులు-1975ని పునరుద్ధరించండి.

–  గవర్నర్‌కు ఎల్‌సీజీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రపతి ఉత్తర్వులు-1975ని పునరుద్ధరించాలని లోకల్‌ క్యాడర్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (ఎల్‌సీజీటీఏ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఎల్‌సీజీటీఏ అధ్యక్షులు ఎం వీరాచారి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు -2018ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.