నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి వై.ఎస్.షర్మిల చేరికతో అక్కడ పార్టీ బలోపేతం అవుతుందని టీపీసీసీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమపై ఉన్న నమ్మకంతో ప్రజలు గెలిపించారనీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెల్షిపరు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు.