సీఎం రేవంత్‌రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

సీఎం రేవంత్‌రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు– తెలిపిన మంత్రి సురేఖ, దోబ్రియాల్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం. దోబ్రియాల్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కార్యాలయంలో కొండా సురేఖ అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించిన 2024 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్‌, పీసీసీఎఫ్‌ దోబ్రియాల్‌, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.