– టీఆర్టీఎఫ్ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా విద్యారంగంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) డైరీని ఆ సంఘం అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి కావలి అశోక్‌కుమార్‌తో కలిసి సీఎం ఆవిష్కరించారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిల్పడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము సహకరిస్తామని కటకం రమేష్, అశోక్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ ప్రతినిధులు లక్కిరెడ్డి సంజీవరెడ్డి, డి విష్ణుమూర్తి, ప్రభాకర్‌రావు, ప్రనీద్, కృష్ణారెడ్డి, రాజు, కిషన్, సలీం, కృష్ణప్రసాద్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.