
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రభుత్వం మారిన అధికారులు వ్యవహారించే తీరు మారడంలేదనే అపోహలు మండలంలో వెల్లవెత్తుతున్నాయి. అధికారుల తీరుకు నిదర్శనంగా మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయమని ఘంటపథంగా చెప్పోచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలన బాధ్యతలు చేపట్టి రోజులు గడుస్తున్న గాగీల్లపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముఖ్యమంత్రి స్థానంలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో యథావిధిగా ప్రజలకు దర్శనమిస్తూనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ పోటోను అధికారులు యథావిధిగా కొనసాగించడం అధికారులు తమ విధుల్లో అలసత్వానికి దర్పణం పడుతోందని పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు గత ప్రభుత్వ భ్రమల్లోంచి మేల్కోని మండలంలోని అయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయాలను క్షేత్ర స్థాయిలో సందర్శించి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటో ఏర్పాటు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు.