నవతెలంగాణ- చివ్వేంల
కులమత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ప్రజా పాలన సభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డిఅన్నారు. మంగళవారం గాయం వారి గూడెం ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డు లేనివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6వ తారీకు వరకు కొనసాగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి, సర్పంచ్ సైదులు, డిఈ శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ ఝాన్సీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరన్న నాయక్, మాజీ జెడ్పిటిసి చింతమల్ల రమేష్, కాంగ్రెస్ నాయకులు కలకోట్ల సంజీవ, జెర్రి పోతుల కృష్ణయ్య, ధరావత్ బిచ్చు నాయక్, సైదులు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు..