ప్రణయనాథ చిత్రాలయ బ్యానర్‌పై ప్రణయనాథ, మధుబాల హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ల్యాండ్ మాఫియా’. బాబు వీఎన్ దర్శకుడు. శీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత ప్రణయ నాథ మాట్లాడుతూ, ‘చిన్న చిత్రంగా మొదలైన ఈ ప్రాజెక్టు పెద్ద సినిమాగా మారింది. మొదటి నుంచి మాకు శ్రావ్య ఫిల్మ్స్ అండగా నిలబడింది. ఓ మంచి చిత్రాన్ని తీశాం. త్వరలోనే మా చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు ‘ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. సందేశంతో పాటు అన్ని రకాల కమర్షియల్ అంశాలుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని నాయిక మధుబాల అన్నారు. డైరెక్టర్ బాబు మాట్లాడుతూ, ‘మా నిర్మాత ప్రణయనాథ ఎంతో సహకరించారు. ఖర్చుకి ఎక్కడా వెనకడుగు వేయలేదు. సునీల్ కుమార్ రెడ్డి సహకారంతో సినిమాను పూర్తి చేశాం’ అని తెలిపారు. ఎడిటర్ కష్ణ మండల మాట్లాడుతూ, ‘ఈ సినిమా పెద్ద సినిమాగా మారడం వెనుక ప్రణయనాథ ప్యాషన్ ఉంది. సునీల్ కుమార్ రెడ్డి వెన్నంటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేశారు. టీం అంతా కలిసి ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
‘నా ఫ్రెండ్ ఎక్కలి రవీంద్ర బాబు వల్ల ఈ టీంను కలిశాను. తను చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుండి నడిపించాను. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని, చిత్రయూనిట్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అని సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.