పేదల అభివృద్ధి కోసమే అభయహస్తం ఆరు గ్యారంటీలు

– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
నవతెలంగాణ నెల్లికుదురు : పేదల అభివృద్ధి కోసమే అభయ హస్తం ఆరు గ్యారంటీలకు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేదుకు దోహదపడుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మరియు జామ తండాలో ప్రజా పాలన దరఖాస్తుల తీసుకునే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే ఈ ఆరోగ్యారంటీల పథకాలను ప్రవేశ పెట్టామని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే దరఖాస్తు ఫారం ను పూర్తిస్థాయిలో చదివి తప్పులు లేకుండా నింపాలని అన్నారు అలా నింపిన దరఖాస్తును తిరిగి అధికారులకు ఇవ్వాలని అన్నారు మీకు కావలసినటువంటి రాసుకొని ఇచ్చిన తర్వాత అమలుకై ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు మీ అభివృద్ధి కోసమే అధికారులు మీ వద్దకు వచ్చి మీ సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు మీరు ఓట్లు వేసి గెలిపించి మీరు అనుకున్న అభివృద్ధిని సాధించేందుకు నేను కృషి చేస్తానని అన్నారు నన్ను గెలిపించినందుకు మీకు కృతజ్ఞతలు అన్నారు మీకు ఏ ఆపద వచ్చినా మీ వెంట ఉంటానని మీ సమస్యల పరిష్కారానికి నేను మరియు ప్రభుత్వం అధికారులు అండదండలుగా ఉంటారని అన్నారు మీరు అధైర్య పడవద్దు అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీరవెల్లి యాదగిరిరెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ ఎంపీటీసీ వాణి శ్రీనివాస్ నియోజకవర్గ స్పెషల్ఆఫీసర్ సూర్యనారాయణ ఎంపీటీసీ గోవర్ధన్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి మాజీ జెడ్ పి టి సి హెచ్ వెంకటేశ్వర్లు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి జిల్లా నాయకులు బాలాజీ నాయక్ లక్ష్మారెడ్డి మద్ది రాజేష్ క్రాంతి రెడ్డి రత్నపురం యాకయ్య కుమ్మరి కుంట్ల మౌనేందర్ సలుగు పూర్ణచందర్ వరిపల్లి పూర్ణచందర్ మౌలానా పట్నం శెట్టి నాగరాజు శ్రీనివాస్ రెడ్డి గోగుల అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.