చదువుల తల్లి సావిత్రిబాబు పూలే

– ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు నరేశ్ మాదిగ
నవతెలంగాణ-మల్హర్ రావు : చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ని మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ అన్నారు.పూలే 194వ జయంతి వేడుకలు పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్ల పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్త్రీకి విద్యను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని కొనియాడారు.సావిత్రిబాయి పాటలు చెప్పేందుకు స్కూలుకు వెళ్తున్న దారిలో సాంప్రదాయ వాదులు ఆమెపై పేడ రాళ్లు విసరడం వంటి అవమానాలకు గురి చేయగా సావిత్రిబాయి పూలే ఇవి నాకు పూలతో సమానం. ఇలా ప్రోత్సాహం చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని ప్రతిస్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఇందారపు ప్రభాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మండల కేంద్రమైన కాంగ్రెస్ పార్టీ తాడిచెర్ల గ్రామ శాఖ అధ్యక్షులు కేసారపు చంద్రయ్య బూడిద రాజా సమ్మయ్య నారమల్ల రంజిత్ ఇందారపు శ్రీను అక్కపాక శంకర్ తాండ్ర శంకర్ కుంటాల రాకేష్ మారుపాక దేవేందర్ కాసిపేట రాజయ్య ఇందారపు హేమంత్ పాల్గొన్నారు.