నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. బుధవారం పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పొట్లపల్లి లో గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రను మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. పేద వానికి సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తీసుకు రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ హయాం లో జరిగిన అభివృద్ధి తప్ప… బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం మన్నారు. రూ. 500 కే గ్యాస్, సొంత ఇంటి నిర్మాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పించన్ రూ. 5000 ఇస్తామని, అధికారం లోకి వచ్చిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేల సాయం, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు రూ. 12 వేల సాయం అందిస్తామని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియా గాంధీ ఋణం తీర్చు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కేడం లింగ మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోలిషెట్టి శివయ్య, వైస్ ఎంపిపి దేవసాని నిర్మల- నర్సింహా రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు, అక్కన్న పేట మండల పార్టీ అధ్యక్షులు జంగపల్లి అయిలయ్య, కోహెడ మండల పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కర్ర రవీందర్ రెడ్డి, ఎగ్గిడి అయులయ్య, భూపతి ముకుంద రెడ్డి, డైరెక్టర్లు తాళ్ళ పల్లి కావ్య – వెంకట స్వామి, గుర్రాల లింగా రెడ్డి, బండి కుమార్, వల్లెపు రాజు, పున్న లావణ్యయ, గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజి రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బూరుగు కీష్ట స్వామి, ఎస్టీ సెల్ అధ్యక్షులు బిక్యా నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మైనార్టీ సెల్ హాసన్, లక్ష్మానా చారి, కర్ర శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మ్యాక రమేష్, మాజీ సర్పంచ్ లు వడ్లూరు సులోచన లక్ష్మన్, గుర్తూరి రాజవ్వ చంద్ర మౌళి, బోంగోని శ్రీనివాస్, సంగ శ్రీధర్, సంగ కుమార్, కవ్వ రాజి రెడ్డి, చిత్తంపల్లి అయిలయ్య, జీమ్మల భీం రెడ్డి, చీకట్ల రాజయ్య, శెట్టి సుధాకర్, వెన్న రాజు, యాదవ రెడ్డి, గాజుల చంద్రయ్య, మార్క రాజేశ్వరి, రాజ మౌళి, నీలం పాపి రెడ్డి, కర్ర రజనీ రెడ్డి, గాలి పెళ్లి శ్రీనివాస్, పసుమట్ల రాధ, రమ, కనుకమ్మ, ఎడబోయిన మహేందర్ రెడ్డి, తాళ్ళ పల్లి సదానందం, డబ్బా శంకర్, బొట్టు మొగిలి, పూదరి రవి, జోడు ముంతల వెంకట స్వామి, శ్రీనివాస్ రెడ్డి, చింతకింది శంకర్, వేల్పుల వెంకట స్వామి, బందారపు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు పోచవేని శ్రీశైలం, పాంద్రాల దామోదర్, చెన్న వేన విద్యా సాగర్, విశ్వ తేజ, మంద పరశు రాములు, ముడికే ప్రశాంత్, మారుపాక గణేష్, భశవేని రాజు తదితరులు పాల్గొన్నారు.