నవతెలంగాణ కంటేశ్వర్
ప్రతినెల 24వ తేదీన నిక్షయ్ దివాస్ అనే కార్యక్రమాన్ని జరుపుకొంటున్నాము అనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం తెలిపారు. ఇందులో భాగంగా టిబి రోగులలో భరోసా కల్పించడానికి బుధవారం నాడు జిల్లా కేంద్రం లోని అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో వాల్ పెయింటింగ్ కార్యక్రమం ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ యం సుదర్శనం మాట్లాడుతూ.. టిబి రోగులు మేము ఒంటరి అనే భావన రావద్దనే ఉద్దేశం తో మందులు వాడుతున్న వారిచేత ఇలా పెయింటింగ్ వేస్తూ వారు పొందుతున్న సేవలు అర్థమయ్యేలా బొమ్మల రూపంలో ఉన్నాయని తెలిపారు.
టిబి మందులు వాడుతున్న వారు ఇతరులకు ఈ వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త పడేలా చూడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్యేశ్యం అని అన్నారు.15 మంది టిబి రోగులు కలిసి ఈ పెయింటింగ్ ని పూర్తి చేసారని తెలిపారు. ఈ కార్యక్రమం లో అర్సపల్లి మెడికల్ ఆఫీసర్ మధుసూదన్, జిల్లా టిబి కోఆర్డినేటర్ రవిగౌడ్, హెచ్ ఈ ఓ ముక్తార్ హుస్సేన్, కమ్యూనిటీ ఆఫీసర్ వెంకటేష్, హెల్త్ ఎడ్యుకేటర్ మధుకర్, హెల్త్ విజిటర్ విజయమాల టిబి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
