గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

– మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్

నవతెలంగాణ-నెల్లికుదురు : గ్రామాలకు కావలసిన మౌలిక వసతులను గుర్తించి గ్రామాల అభివృద్ధి పరచడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. గురువారం  మండలంలోని రాజుల కొత్తపల్లి లో జరిగిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై స్వయాన ఎమ్మెల్యే దరఖాస్తుల స్వీకరించారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి మునిగలవేడు నరసింహుల గూడెం గ్రామాలలో ఎంపీడీవో శేషాద్రి మరియు తహసిల్దార్ కోడి చింతల రాజు టీమ్ల ఆధ్వర్యంలో అభయహస్తం దరఖాస్తుల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో ఇచ్చిన హామీలను అమలుపరిచేందుకే  అభయ హస్తం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అన్నారు  ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రాజుల కొత్తపల్లి ప్రజల రుణం తీర్చుకుంటానని డాక్టర్ మురళి నాయక్ అన్నారు.
మా గ్రామ సమస్యలు తీర్చండి:సర్పంచ్ ఎంపీటీసీ
ఎన్నో ఏండ్లుగా ఆ గ్రామానికి బస్సు సౌకర్యం లేక జిల్లా కేంద్రానికి నెల్లికుదురు మండల కేంద్రానికి నిత్యం అవసరాల నిమిత్తం పోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సాగునీటికి కెనాల్ కాల్వ నుండి నీరు అందక రైతాంగం అవస్థలు పడుతున్నామని సర్పంచ్ సంధ్యారాణి ఎంపిటిసి గోవర్ధన్ ఎమ్మెల్యే కోరారు వెంటనే ఎమ్మెల్యే మురళి నాయక్ స్పందించి గతంలో నడిచి ఇప్పుడు బంధు అయిన గ్రామాలను సంబంధిత ఆర్టీసీ డిఎం తో మాట్లాడి వెంటనే ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తానని అన్నారు రైతుల కూడా ఇబ్బంది పడకుండా నీటి సౌకర్యం కూడా కల్పించేందుకు  సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించలేదని అన్నారు తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతోమంది వందలాది జనం ఆత్మ బలిదానం చేసుకుంటున్న తరుణంలో తల్లి సోనియా గాంధీ స్పందించి తెలంగాణ ఇస్తే కెసిఆర్ కుటుంబానికి అంకితమైందని అన్నారు కనీసం పేదల ప్రజల బ్రతుకులను పట్టించుకోవడంలో విఫలం చెందారని అన్నారు కోట్లాది రూపాయల దొండగూడెంలో అగ్రస్థానంలో నిలబడ్డారని అన్నారు కనీసం చదువుకొని ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి సూర్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి రామారావు తాహసిల్దార్ రాజు స్థానిక ఎంపీడీవో ఎంపీ ఓ బండారు పార్థసారథి  సర్పంచ్ తుళ్ళ సంధ్యారాణి చింతకుంట్ల యాకన్న ఎంపీటీసీ వెల్డి గోవర్ధన్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీ జేల్ల వెంకటేష్ పంచాయతీ కార్యదర్శి. అశ్విని మగ్న యాకోబు రెడ్డి మణిదీప్ తోపాటు రెండు టీముల సభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.