నవతెలంగాణ కంటేశ్వర్ : నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో స్థానిక మారుతి నగర్ లోని దివ్యాంగుల పాఠశాలలో అందుల అక్షర ప్రదాత లూయీ బ్రెయిలీ 215 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అందుల వనరుల కేంద్రంలో జిల్లా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ జిల్లా ప్రభుత్వ అంద ఉద్యోగుల సంఘం అంద నిరుద్యోగుల సంఘం స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో లూయీ బ్రెయిలీ 125 వ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరై లూయి బ్రెయిల్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ.. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే విషయం అందరికీ తెలుసు అని శరీరంలో ఏ అవయవం తక్కువ అయినా ఏదో విధంగా నెట్టుకు రావచ్చు కానీ దృష్టిలోపం ఉన్నట్లయితే జీవితాన్ని నెట్టుకు రావడం చాలా కష్టమని అన్నారు. ఈ సృష్టిలో దేవుడు రకరకాలుగా చాలా వస్తువులను సృష్టించాడని మనిషి ఏదైనా వస్తువును చూసినప్పుడు మాత్రమే దాని అవసరాన్ని అందాన్ని అర్థం చేసుకోగలుగుతాడని తెలిపారు అదే చూడలేకపోవడం నరకమని అన్నారు నేడు అందులు దృష్టిలోపాన్ని పక్కన పెట్టి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతున్నారని పేర్కొన్నారు అంధులలో ఆత్మవిశ్వాసం పట్టుదల అధికంగా ఉంటాయని దాని వలన దృష్టి గల వారి కన్నా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందగలుగుతారని ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతున్నారని తెలిపారు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ శాఖ అధికారి రసూల్ బి మాట్లాడుతూ.. దివ్యాంగులకు సేవ చేయడం దేవుడికి సేవ చేయడం అని అన్నారు. చాలామంది పుణ్యం కోసం కాశీ రామేశ్వరం వెళ్తారని తమ పొరుగున ఉన్న దివ్యాంగులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు జిల్లాలో అందుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న స్నేహ సొసైటీని ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేందర్ స్నేహ సొసైటీ కార్యదర్శి యస్. సిద్దయ్య అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సాగర్ అంద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయన్న నిరుద్యోగుల సంఘం అధ్యక్షులు ఇలియాజ్ ఉద్దీన్ స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ యస్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందులకు సేవ చేస్తున్న ప్రముఖులను సన్మానించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన అంద విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా అంద విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అంద ఉద్యోగులు అంద నిరుద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.