
నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త,జాగృతి డిగ్రీ రాము, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి జన్మదిన సందర్భంగా వారి కార్యాలానికి వెళ్లి పూలమాలవేసి, శాలువా తో సత్కరించి. కేక్ కట్ చేసి గురువారం ట్రస్మ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పగిడాల జలంధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ సింగన బోయిన మల్లేశం, పగిడాల పురేందర్ రెడ్డి,ఆకుల సుధాకర్, దొమ్మాటి సత్యనారాయణ,మణిపాల్ రెడ్డి, రాము పాల్గొన్నారు.